మెల్బోర్న్: హమ్మయ్య.. గండం గట్టెక్కింది. మెల్మోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఎదురీదుతున్న టీమ్ఇండియాను తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఆదుకున్నాడు. ఆస్ట్రేలియాపై తొలి హాఫ్ సెంచరీతో ఫాల్ఆన్ ముప్పు తప్పించాడు. 5 వికెట్ల నష్టానికి 164 రన్స్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 55వ ఓవర్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ (28)ను బోలాండ్ ఔట్ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్ జడేజాతో కలిసి ఒక్కో పరుగు జోడిస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ దశలో మరోసారి ఆసీస్ బౌలర్లు పైచేయి సాధించారు.
క్రీజులో కుదుకుంటున్న ఆల్‌రౌండర్ జడేజా (17)ను నాథన్ ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్‌కు పంపించాడు. దీంతో భారత్‌కు ఫాల్ ఆన్ గండం తప్పదనే అనిపించింది. అయితే నితీశ్‌తో జతకట్టిన వాషింగ్టన్ సుందర్ ఆసీస్ సేస్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో నితీశ్ కుమార్ 81 బాల్స్‌లో 50 రన్స్ పూర్తి చేశాడు. దీంతో ఆస్ట్రేలియాపై మొదటి అర్ధసెంచరీ సాధించాడు. ప్రస్తుతం నితీశ్ (61), సుందర్ (31) క్రీజ్‌లో ఉండగా.. భారత్ 7 వికెట్ల నష్టానికి 291 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా మరో 183 పరుగులు వెనకపడి ఉన్నది.
फ्लावर नहीं फायर है! 🔥
Nitish Kumar Reddy brings up his maiden 50 in Test cricket and unleashes the iconic celebration. 👏
Follow live: https://t.co/njfhCncRdL#TeamIndia pic.twitter.com/4aNqnXnotr
— BCCI (@BCCI) December 28, 2024