IPL 2024 SRH vs PBKS : ముల్లన్పూర్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదో వికెట్ కోల్పోయింది. విధ్వంసక ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్(9) ఔటయ్యాడు. హర్షల్ పటేల్ ఓవర్లో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద సామ్ కరన్ చేతికి చిక్కాడు. దాంతో, ఐదో వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఓవైపు వికెట్లు పడుతున్న యువకెరటం నితీశ్ రెడ్డి(63) చెలరేగుతున్నాడు. 64 పరుగులకే 4 వికెట్లు పడిన జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నాడు. హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరన్‌లను టార్గెట్ చేసిన నితీశ్ సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు అబ్దుల్ సమద్ క్రీజులోకి వచ్చాడు. 15 ఓవర్లకు హైదరాబద్ స్కోర్.. 133/5.
A special counter attacking innings from Nitish Kumar Reddy 🙌
He is leading #SRH‘s fightback with some glorious shots 👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia💻📱#TATAIPL | #PBKSvSRH | @SunRisers pic.twitter.com/6SFysFcqKz
— IndianPremierLeague (@IPL) April 9, 2024
టాస్ ఓడిన హైదరాబాద్‌కు ఆది నుంచి షాక్‌లు తలుగుతున్నాయి. రబడ వేసిన తొలి ఓవర్ మొదటి బంతికే ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న ఓపెనర్ ట్రావిస్ హెడ్(21) ధావన్‌కు దొరికాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన నాలుగో ఓవర్లో హెడ్, ఎడెన్ మర్క్రమ్(0)లు ఔటయ్యారు. ఆ తర్వాత అభిషేక్ శర్మ(16) ధాటిగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రాహుల్ త్రిపాఠి(11)ని హర్షల్ పటేల్ వెనక్కి పంపాడు. అక్కడితో 64 పరుగులకే కమిన్స్ సేన టాప్ గన్స్ పెవిలియన్ చేరారు.