చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ బ్యాట్స్‌మన్ నితీశ్ రాణా అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆరంభం నుంచి వేగంగా ఆడుతూ 37 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ సాధించాడు. ఐపీఎల్లో అతనికిది 12వ ఫిఫ్టీ కావడం విశేషం.
ఓపెనర్లు నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభాన్ని అందించారు. రషీద్ ఖాన్ వేసిన 7వ ఓవర్లో గిల్ ఔటైనా రాణా(64) జోరు తగ్గించలేదు. వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 12 ఓవర్లకు కోల్‌కతా వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో రాహుల్ త్రిపాఠి(26) చెలరేగుతున్నాడు.
Cometh the hour, cometh @rashidkhan_19.
— IndianPremierLeague (@IPL) April 11, 2021
Gets the breakthrough with a googly that Shubman doesn't pick.
Live – https://t.co/pSh1Qt33LQ #SRHvKKR #VIVOIPL pic.twitter.com/EdaXjTwvYE