న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ రిలేస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి గంధె నిత్యతో కూడిన భారత జట్టు 4×100 మీటర్ల మిక్స్డ్ రిలేలో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. నిత్య, రాహుల్ కుమార్, అనిమేష్ కుజుర్, స్నేహ ఎస్.ఎస్.తో కూడిన భారత్ ఆదివారం జరిగిన ఈ రేసును 41.35 సెకన్లలో పూర్తి చేసింది.
దాంతో మార్చిలో నమోదైన 42.30 సెకన్ల పాత రికార్డును బద్దలు కొట్టింది. అయితే, ఈ సమయం ఫైనల్స్‌కు చేరుకోవడానికి సరిపోకపోవడంతో భారత జట్టు తమ హీట్‌లో ఆరో స్థానంలో, ఓవరాల్‌గా పదో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.