హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ)లో విశిష్ట సేవలందించిన అడిషనల్ ఎస్పీ ఎంజీ ప్రకాశ్‌రావు ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా వీడోలు సభ నిర్వహించారు. ఐఎస్‌డబ్ల్యూ అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా ఓఎస్డీ వీ బీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ సహజమైన ప్రక్రియే అయినప్పటికీ, ప్రకాశ్‌రావు శాఖకు అందించిన సేవలు, అనుభవం చిరస్మరణీయమని పేర్కొన్నారు.