పారిస్: రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ(Nita Ambani).. పారిస్ ఒలింపిక్స్‌లో ప్రత్యేకంగా కనిపించారు. అక్కడ ఆ సంస్థకు చెందిన స్వదేశ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్న ఇండియా హౌజ్ వద్ద దీన్ని శనివారం నీతా అంబానీ ఓపెన్ చేశారు. భారతీయ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్‌కు చెందిన వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో కలిపి రిలయన్స్ ఫౌండేషన్ .. ఇండియా హౌజ్ కాన్సెప్ట్‌ను డెవలప్ చేశారు. ఆ స్టోర్‌కు చెందిన వీడియోను నీతా అంబానీ రిలీజ్ చేశారు. ఇండియా హౌజ్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్వదేశ్ పెవిలియన్ వీడియోను పోస్టు చేశారు. నీతా అంబానీ ఆ సెంటర్‌ను వివరించారు. గత ఏడాది హైదరాబాద్‌లో స్వదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ స్టోర్‌ను నీతా అంబానీ లాంచ్ చేశారు.
#WATCH | IOC member and CEO & Chairperson of Reliance Foundation, Nita Ambani gives us a glimpse of the first ever India House at the Olympics, bringing the spirit of India to Paris. pic.twitter.com/jxlTKEg3Dq
— ANI (@ANI) July 30, 2024