హైదరాబాద్, ఆట ప్రతినిధి: పుణె వేదికగా జరుగుతున్న జాతీయ జూనియర్, సీనియర్ అర్టిస్టిక్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిష్క అగర్వాల్ సత్తాచాటింది. శుక్రవారం జరిగిన మహిళల అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో నిష్క 43.750 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది.
ఇదే విభాగంలో సమంత(రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్, 43.900), స్నేహ తరియాల్(ఢిల్లీ, 43.750) వరుసగా ఒకటి, మూడు స్థానాలు దక్కించుకున్నారు. జాతీయ టోర్నీలో రాణించడం ద్వారా కొరియా వేదికగా జూన్ 12 నుంచి మొదలయ్యే ఏషియన్ చాంపియన్షిప్ టోర్నీకి నిష్క ఎంపికైంది.