Neymar : హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్.. మైదానంలో ఆడే ఆట ఏదైనా ఓటమిని తట్టుకోలేరు కొందరు. అదే ఘోర పరాజయం ఎదురైనప్పుడు ఎంత బాధను ఎంతగా దిగమింగాలనుకున్నా సాధ్యం కాదు. ఆ క్షణంలో ఉబికివస్తున్న కన్నీళ్లను నియంత్రించలేక వలవల ఏడుస్తారు. తాజాగా ఫుట్‌బల్ స్టార్ నెయ్మర్ (Neymar) సైతం పిల్లాడిలా కంటతడి పెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వాస్కోడిగామా ( Vasco da Gama) టీమ్ చేతిలో బ్రెజిల్ ఫార్వర్డ్ సారథ్యం వహిస్తున్న శాంటోస్ చిత్తుగా మట్టికరిచింది. అంతే.. ఓటమిని తట్టుకోలేక నెమ్మర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఆగస్టు 17 ఆదివారం ఏకపక్షంగా సాగిన పోరులో వాస్కొడిగామా టీమ్‌కు గోల్స్ వర్షం కురిపించింది. శాంటోస్ జట్టు ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. వాస్కొడిగామా జట్టులోని ఫిలీప్పే కౌటిన్హో, లుకాస్ పిటొన్, డేవిడ్ ఫొన్సెకా, రయాన్, డానిలో నెవెస్ తలా ఒక గోల్‌తో జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించారు. మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా కొట్టలేక 0-6తో శాంటోస్ ఓడిపోయింది. దాంతో.. ఆ బాధను తట్టుకోలేకపోయాడు నెయ్మర్.
🥺💔 Wow. Neymar 🇧🇷 est en pleurs après la défaite 6-0 de Santos ce soir. pic.twitter.com/mRv0uKMDsD
— Actu Foot (@ActuFoot_) August 17, 2025
బ్రెజిల్ తరఫున ఎన్నో అద్భుతమైన గోల్స్ చేసిన అతడు ‘మరీ ఇంత దారుణంగా ఓడిపోయాం’ అని మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యాడు. గ్రౌండ్‌లోనే కూలబడి చేతులతో కన్నీ్ళ్లు తుడచుకుంటున్న అతడిని సహచరులు, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు హత్తుకొని ఓదార్చారు. మ్యాచ్ అనంతరం జట్టు ఓటమిపై నెయ్మర్ తీవ్రంగా స్పందించాడు.
‘మైదానంలో మా ప్రవర్తనను మీరు దేశ ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పండి. ఈ రోజు మా ప్రదర్శన చాలా ఘోరంగా ఉంది. శాంటోస్ జెర్సీతో ఇంత చెత్తగా ఆడడం అవమానంగా అనిపిస్తోంది. ఆటగాళ్లందరూ ఇంటికి వెళ్లాక మీ ఆటను విశ్లేషించుకోండి. మెరుగయ్యేందుకు ఏం చేయాలో ఆలోచించండి’ అని జట్టు సభ్యులను నెయ్మర్ సుతిమెత్తగా హెచ్చరించాడు. ఆగస్టు 24న శాంటోస్ జట్టు బహియా టీమ్‌ను ఢీకొట్టనుంది.
Coutinho beats his old friend Neymar 6️⃣➖0️⃣ 😵 pic.twitter.com/H3667bfZRq
— 433 (@433) August 17, 2025