ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ముందు టీం ఇండియా 250 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్, టీం ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ కివీస్ గెలుచుకుని ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్దేశిత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 79, హార్దిక్ పాండ్యా 45, అక్షర్ పటేల్ 42 పరుగులు చేసి, జట్టుకు మెరుగైన స్కోర్ అందించారు.
ఓపెనర్లుగా వచ్చిన సారధి రోహిత్ శర్మ 15 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ రెండు పరుగులకే ఔటయ్యాడు. వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం 11 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్‌తో కలిసి జట్టు స్కోర్ నిలకడగా పెంచాడు. శ్రేయాస్ అయ్యర్.. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అక్షర్ పటేల్ రూపంలో టీం ఇండియా మరో వికెట్ కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ 23 పరుగులు చేయడంతోపాటు శ్రేయాస్ అయ్యర్‌కు బాసటగా నిలిచాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 172 పరుగుల వద్ద 79 (రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లు) పరుగులకు శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యాడు.
తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కాస్త క్రీజ్‌లో నిలబడ్డారు. పాండ్యా 45, రవీంద్ర జడేజా 16 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టారు. మహ్మద్ షమీ 50వ ఓవర్ చివరి బంతిని ఫిలిప్స్ కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో టీం ఇండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు, క్యేల్ జామియాసన్, విల్ ఓ రూర్కే, మిచెల్ శాంత్నర్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు.