హామిల్టన్(న్యూజిలాండ్): పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన రెండో టీ20లో కివీస్ 21 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. తొలుత ఓపెనర్ ఫిన్ అలెన్(74) అర్ధసెంచరీతో కివీస్ 20 ఓవర్లలో 194/8 స్కోరు చేసింది. సహచర బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేని వేళ అలెన్..పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించాడు.
హారిస్ రవూఫ్(3/38), అఫ్రిదీ(2/43) ఆకట్టుకున్నారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పాక్ 19.3 ఓవర్లలో 173 పరుగులకు పరిమితమైంది. బాబర్ ఆజమ్(66), ఫకర్ జమాన్(50) అర్ధసెంచరీలతో రాణించారు. మిల్నె(4/33) నాలుగు వికెట్లతో విజృంభించాడు. అలెన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్నది.