కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు చివరి రోజు ఆసక్తికరంగా మారింది. రెండవ ఇన్నింగ్స్‌లో 284 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. అయిదో రోజు భోజన విరామ సమయానికి వికెట్ నష్టానికి 79 రన్స్ చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి సోమర్‌విల్లీ 36, టామ్ లాథమ్ 35 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఇవాళ తొలి సెషన్లో న్యూజిలాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. భారత బౌలర్లు ఇవాళ ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. దీంతో మ్యాచ్ రసవత్తర దిశగా వెళ్తోంది. ఇంకా రెండు సెషన్స్‌లో దాదాపు 60 ఓవర్లు ఇండియా బౌల్ చేయాల్సి ఉంటుంది. 60 ఓవర్లలో న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 205 రన్స్ చేయాలి. ఒకవేళ ఇండియా లంచ్ తర్వాత వికెట్లను త్వరగా తీస్తే అప్పుడు మ్యాచ్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కివీస్ బ్యాటర్లు ఆడుతున్న తీరు డ్రా అయ్యే ఆలోచనల్ని కూడా రేకెత్తిస్తుంది.
స్కోరు బోర్డు
ఇండియా 345 & 234/7 డిక్లేర్డ్
న్యూజిలాండ్ 296 & 79/1