కాన్పూర్ : హమ్మయ్య.. ఎట్టకేలకు ఇండియాకు బ్రేక్ దొరికింది. న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ ఔటయ్యాడు. కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు మూడవ రోజు.. అశ్విన్ బౌలింగ్‌లో యంగ్ క్యాచ్ ఔటయ్యాడు. వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఆ క్యాచ్ పట్టాడు. 214 బంతుల్లో 15 ఫోర్లతో యంగ్ 89 రన్స్ చేశాడు. రెండో రోజు వికెట్ నష్టపోకుండా 129 రన్స్ చేసిన న్యూజిలాండ్.. మూడో రోజు కూడా నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 72 ఓవర్లలో వికెట్ నష్టానికి 173 రన్స్ చేసింది. లాథమ్ 64, విలియమ్స్ 8 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.