చారిత్రక సీన్ నదిని వేదికగా చేసుకుంటూ సాగిన పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలపై విమర్శల జడివాన కురుస్తున్నది. తమదేశ ఘనమైన వారసత్వాన్ని చూపించే క్రమంలో ఫ్రాన్స్ నవ్వులపాలైంది. వెస్ట్రన్ సివిలైజేషన్ను పూర్తిగా ఎగతాళి చేస్తూ రూపొందించిన డ్రాగ్-క్వీన్ థీమ్‌తో కూడిన కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో మ్యారీ అంటోనెటి తన తలను చేతిలో పట్టుకున్నట్లు కనిపిస్తున్న వీడియోతో పాటు విచిత్రమైన మేకప్, భారీ కాయం ఉన్న మహిళ ధరించిన దుస్తులు, లియోనార్డీ డావిన్సి ‘ద లాస్ట్ సప్పర్’ వేషధారణ, ఏసుక్రీస్తుపై పేయిటింగ్పై నిర్వాహకులు.. సోషల్‌మీడియాలో భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు.