లక్నో: వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు 263 పరుగుల లక్ష్యాన్ని విసిరింది నెదర్లాండ్స్(NED VS SL). తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్.. 49.4 ఓవర్లలో 262 రన్స్ చేసి ఆలౌటైంది. ఓ దశలో 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్‌ను సిబ్రాండ్ ఎంగిల్బ్రెచ్, లోగన్ వాన్ బీక్ ఆదుకున్నారు. ఆ ఇద్దరూ ఏడో వికెట్‌కు 130 రన్స్ జోడించారు. ఎంగిల్బ్రెచ్ 82 బంతుల్లో 70 రన్స్ చేయగా, లోగన్ 75 బంతుల్లో 59 రన్స్ చేశారు. నిజానికి ఆరంభంలో లంక బౌలర్లు దుమ్మురేపారు. నెదర్లాండ్స్ టాప్ బ్యాటర్స్‌ను వణికించారు. రజత, మధుశంకలు చెలరేగి బౌలింగ్ చేశారు. ఆ ఇద్దరూ చెరో నాలుగేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.