టోక్యో: నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించాడు. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సూపర్ షో కనబరిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జావెలిన్‌ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. అథ్లెటిక్స్‌లో నీరజ్ బంగారు పతకాన్ని అందించి ఇండియాకు చిరస్మరణీయ రోజును మిగిల్చాడు.
తొలి ప్రయత్నంలో అతను 87.03 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. ఇక రెండో అటెంప్ట్‌లో అతను మరింత పదునుగా త్రో చేశాడు. సెకండ్ అటెంప్ట్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. నిజానికి క్వాలిఫయింగ్ రౌండ్లో ఫస్ట్ త్రోతోనే అందరికీ షాకిచ్చాడు నీరజ్. అతని పర్సనల్ బెస్ట్ 88.07 మీటర్లు. దానికి తగినట్లే నీరజ్ టోక్యోలో తన ట్యాలెంట్ చూపించాడు. ముందు నుంచి ఫెవరేట్‌గా ఉన్న నీరజ్.. అనుకున్నట్లే ఇండియాకు ఓ స్వర్ణాన్ని అందించాడు.
ప్రతి అటెంప్ట్‌లోనూ నీరజ్ నిప్పులు చెరిగే రీతిలో జావెలిన్ త్రో చేశాడు. ప్రతి త్రోలోనూ అతను మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ఆరంభం నుంచి లీడింగ్‌లో ఉన్న చోప్రా.. ఇండియాకు అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించాడు. మూడవ త్రోలో నీరజ్ కేవలం 76.79 మీటర్ల దూరం మాత్రమే జావెలిన్‌ను విసిరాడు. తొలి మూడు రౌండ్లలో లీడింగ్‌లో ఉన్న నీరజ్.. నాలుగవ, అయిదో రౌండ్లో ఫౌల్ చేశాడు.
.@Neeraj_chopra1 creates history by becoming the 1st Indian Track & Field athlete to clinch 🥇 at the #Olympics with a throw of 87.58m
— SAI Media (@Media_SAI) August 7, 2021
His dedication & hard work has paid off and has given 🇮🇳 it's 2nd individual Olympic #Gold medal
Perfect podium finish for #IND at #Tokyo2020 pic.twitter.com/ZNZ7ZRFlCJ
రెండవ, మూడవ స్థానాల్లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్లు నిలిచారు. వద్లేచ్ జాకుబ్ 86.67 మీటర్లు, వెస్లీ వెటిస్లేవ్ ల85.44 మీటర్ల దూరం విసిరి సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అందుకున్నారు.
నీరజ్ గోల్డ్‌తో టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా సాధించిన పతకాల సంఖ్య ఏడుకు చేరుకున్నది. రెజ్లింగ్ రవికుమార్ దహియాకు సిల్వర్, భజరంగ్ పూనియాకు బ్రాంజ్ మెడల్స్ దక్కాయి. ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాభాయి చానుకు సిల్వర్ దక్కగా.. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధుకు బ్రాంజ్ వచ్చింది. బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్కు కాంస్యం చిక్కింది. ఇండియన్ మెన్స్ హాకీ టీమ్‌కు కూడా బ్రాంజ్ మెడల్ వచ్చిన విషయం తెలిసిందే.