ఢిల్లీ : డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా 2025 సీజన్‌ను గెలుపు త్రో తో ఆరంభించాడు. దక్షిణాఫ్రికాలోని పోచెఫ్స్ట్రొమ్లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ చాలెంజర్ ఈవెంట్లో భాగంగా బుధవారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్.. 84.52 మీటర్ల త్రో తో మొదటి స్థానంలో నిలిచాడు. ఫైనల్లో ఆరుగురు పోటీపడగా నీరజ్‌కు అగ్రస్థానం.. దక్షిణాఫ్రికాకే చెందిన డౌ స్మిత్ (82.44 మీటర్లు) రెండో స్థానం దక్కించుకున్నాడు. వచ్చే నెల 16 నుంచి దోహాలో జరుగబోయే డైమండ్ లీగ్ సన్నాహకాల్లో ఉన్న నీరజ్.. ఈ సీజన్లో 90 మీటర్ల మార్కును అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.