ఆసియా గేమ్స్‌కు నీరజ్ దూరం
ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో పతక వేట సాగించాలనుకున్న భారత అథ్లెటిక్స్ బృందానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారీ అంచనాలు పెట్టుకున్న జావెలిన్ స్టార్, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా గాయం కారణంగా వచ్చే నెల జపాన్‌లో జరిగే మెగా గేమ్స్‌కు దూరమయ్యాడు. శిక్షణ సమయంలో కాలి మడమ లిగమెంట్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆసియాడ్‌తో పాటు మిగిలిన సీజన్ మొత్తానికి అతడు స్వస్తి చెప్పాల్సి వచ్చింది.
- ప్రాక్టీస్‌లో కాలి మడమకు గాయం.. డైమండ్ లీగ్ ఫైనల్స్ నుంచీ ఔట్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో పతక వేట సాగించాలనుకున్న భారత అథ్లెటిక్స్ బృందానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారీ అంచనాలు పెట్టుకున్న జావెలిన్ స్టార్, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా గాయం కారణంగా వచ్చే నెల జపాన్‌లో జరిగే మెగా గేమ్స్‌కు దూరమయ్యాడు. శిక్షణ సమయంలో కాలి మడమ లిగమెంట్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆసియాడ్‌తో పాటు మిగిలిన సీజన్ మొత్తానికి అతడు స్వస్తి చెప్పాల్సి వచ్చింది.
ఇటీవల జరిగిన లాసాన్ డైమండః లీగ్ మీట్లో ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో తిరిగి పాత రిథమ్ అందుకున్న నీరజ్ ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. వైద్యుల సలహా, తన కోచింగ్ బృందంతో చర్చించిన అనంతరం ఈ సీజన్‌లోని మిగిలిన పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా చోప్రా వెల్లడించాడు. సెప్టెంబర్ 5న బ్రస్సెల్స్‌లో జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించినప్పటికీ, ఈ గాయం వల్ల ఆ టోర్నీలోనూ పాల్గొనలేకపోతున్నాడు.
‘లాసాన్ టోర్నీలో మంచి ప్రదర్శనతో ఇప్పుడే ఫామ్‌లోకి వస్తున్నానని భావించా. సరిగ్గా ఇలాంటి సమయంలో గాయపడటం తీవ్ర నిరాశ కలిగించింది. కానీ, క్రీడా జీవితంలో సవాళ్లు, అడ్డంకులు సహజమే. ప్రస్తుతం నా దృష్టంతా పూర్తిగా కోలుకుని, మళ్లీ మునుపటి కంటే బలంగా మైదానంలోకి దిగడంపైనే ఉంది’ అని 28 ఏండ్ల నీరజ్ తెలిపాడు. ఈ ఎడిషన్ ఆసియా గేమ్స్‌లో కచ్చితంగా స్వర్ణం నెగ్గుతాడన్న అంచనాలున్న నీరజ్ లేకపోవడం భారత అథ్లెటిక్స్ జట్టుకు లోటు కానుంది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక పసిడి, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్, 2023 బుడాపెస్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం గెలిచి ప్రపంచ జావెలిన్ రంగాన్ని ఏలుతున్నాడు. కాగా, ఆసియా గేమ్స్ వచ్చే నెల 19 నుంచి సెప్టెంబర్ వరకు జరగనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

