Neeraj Chopra | లసానే డైమండ్ లీగ్‌లో నీరజ్.. ఆ ఇద్దరి నుంచే తీవ్రమైన పోటీ..!
Neeraj Chopra : గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్న భారత బడిసె వీరుడు ఈసారి లసానే డైమండ్ లీగ్‌లో పాల్గొంటున్నాడు.
Neeraj Chopra : ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో రజతంతో మెరిసిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరో టోర్నీకి సిద్ధమవుతున్నాడు. గ్లాస్గోలో రెండో స్థానంతో సరిపెట్టుకున్న భారత బడిసె వీరుడు ఈసారి లసానే డైమండ్ లీగ్‌లో పాల్గొంటున్నాడు. అథ్లెటిస్సిమాగానే పిలిచే ఈ ఈవెంట్ ఆగస్టు 21, శుక్రవారం నుంచి మొదలవ్వనుంది.
ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా మళ్లీ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈమధ్యే కామన్వెల్త్ క్రీడల్లో వెండి వెలుగులు విరజిమ్మిన అతడు.. లసానే డైమండ్ లీగ్‌లోనూ అదరగొట్టాలని భావిస్తున్నాడు. ఈ వేదికపై రికార్డు మెరుగ్గా ఉండడంతో మనోడే ఫేవరెట్. అయితే.. ఇక్కడ కూడా భారత అథ్లెట్‌కు శ్రీలంక స్టార్ రుమేశ్ థరంగ పథిరంగే, అర్షద్ నదీమ్(పాకిస్థాన్)లు సవాల్ విసరనున్నారు.
NEERAJ CHOPRA IN THE HUNT! 🇮🇳
The men’s javelin competition is heating up as the race to the 2026 Diamond League enters its decisive phase.
With Rumesh Pathirage, Anderson Peters, Curtis Thompson, Keshorn Walcott and more in the mix, Neeraj Chopra faces a stacked field in the… pic.twitter.com/aTuc6mhlHi
— IndiaSportsHub (@IndiaSportsHub) August 20, 2026
కామన్వెల్త్లో నీరజ్ 85.83 మీటర్లకే పరిమితమవ్వగా.. రుమేశ్ ఏకంగా 89.75 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడిని పట్టేశాడు. ఇక ఫౌల్ కారణంగా నదీమ్ పతకం గెలవలేదు. సో.. లసానే డైమండ్ లీగ్‌లో.. ఈ ఇద్దరు నీరజ్‌కు గట్టి పోటీదారులుగా మారారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో అథ్లెట్ ఖెషోర్న్ వాల్కాట్ కూడా పతకం గెలవగల సమర్ధుడే. ప్రపంచ అథ్లెటిక్స్ ముందు జరుగుతున్న ఈ టోర్నీ అయినందున.. నీరజ్ చోప్రా అంచనాలకు తగ్గట్టు రాణించాలని భావిస్తున్నాడు. 2022, 2023లో ఇక్కడ విజేతగా నిలిచిన నీరజ్.. 2024లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరి, ఈసారి ఏం చేస్తాడో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

