లూసానే: లూసానే వేదికగా శుక్రవారం నుంచి మొదలవుతున్న ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్‌చోప్రా బరిలోకి దిగుతున్నాడు. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న నీరజ్..మరోమారు సత్తాచాటేందుకు తహతహలాడుతున్నాడు.
ఖతార్‌లో గత మే 5వ తేదిన జరిగిన డైమండ్ లీగ్‌లో పసిడి పతకంతో మెరిసిన నీరజ్ లూసానేలోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు డైమండ్ లీగ్‌లో భారత్ నుంచి నీరజ్‌తో పాటు లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ పోటీకి దిగుతున్నాడు.