న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవల ఇంటర్వ్యూలతో బిజీ అయ్యాడు. రకరకాల ప్రశ్నలు ఎదుర్కొంటను అతను.. ఆదివారం ఓ వింత ప్రశ్నను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆన్లైన్లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన నీరజ్‌ను.. చరిత్రకారుడు రాజీవ్ సేథి చాలా ఇబ్బందకర ప్రశ్న వేశారు. అథ్లెట్‌గా శిక్షణ పొందుతూ.. ఎలా శృంగార జీవితాన్ని బ్యాలెన్స్ చేశావంటూ నీరజ్‌ను అడిగారు. ఆ సమయంలో 23 ఏళ్ల గోల్డ్ మెడలిస్ట్ కాస్త తడబడ్డా.. చాలా కూల్‌గానే సమాధానం ఇచ్చారు.
If you thought Malishka was Cringe WATCH Rajeev Sethi go a STEP FURTHER 😡 He asked Neeraj Chopra : "How Do you Balance your Sеx Life with your training??" Disgusted Neeraj replied "Aapke question se mera mann bhar gaya" #NeerajChopra #RajeevSethi pic.twitter.com/qwVd7hAot4
— Rosy (@rose_k01) September 3, 2021
రాజీవ్ ప్రశ్న వేస్తూ.. నీరజ్ నువ్వెంతో అందంగ ఉన్న యువకుడివని, తన ప్రశ్న అసంబద్ధమే అయినా, కానీ తన ప్రశ్న వెనుక ఎంతో ఆంతర్యం ఉన్నట్లు చెప్పారు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నీరజ్ చోప్రా కొంత చికాకుపడ్డాడు. ఆన్సర్ ఇవ్వడానికి నిరాకరించాడు. సారీ సార్.. నేను మీకు సారీ చెప్పేశాను, బహుశా అర్థం చేసుకుని ఉంటారని నీరజ్ అన్నారు.
సెక్స్ లైఫ్ గురించి ప్రశ్న వేయడంతో .. జావెలిన్ త్రోయర్ నీరజ్ ఆందోళనకు గురైన అంశం ఇంటర్వ్యూ వీడియోలో తెలిసిపోయింది. మళ్లీ అదే ప్రశ్న వేయడంతో.. నీరజ్ క్షమాపణలు చెబుతూ.. ప్లీజ్ సార్, మీ ప్రశ్నలతో నా మనసు నిండిందన్నారు. శృంగార జీవితం గురించి నీరజ్ స్పందించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అయ్యింది. కానీ చాలా మంది ప్రముఖులు ప్రశ్న వేసిన రాజీవ్ సేథి వైఖరిని ఖండించారు.
Respect for @Neeraj_chopra1 for the grace with which he has handled all the questions thrown at him, some really crazy and unbecoming ones too. A true sportsman.
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 4, 2021
It seems that the only person who is determined to cross the 90m mark in his next throw and take his country to greater heights is #NeerajChopra himself.
— Priyanka Shukla (@PriyankaJShukla) September 4, 2021
Everyone else is worried and curious about everything except the Javelin!