ఢిల్లీ: భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, పారిస్‌లో రజతం సాధించిన నీరజ్‌కు భారత సైన్యం లెఫ్టినెంట్ కర్నల్ హోదా అందించింది.
ఈ మేరకు బుధవారం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2016లో నయీబ్ సుబేదార్ హోదాలో ఆర్మీలో చేరిన నీరజ్.. టోక్యోలో పసిడి తర్వాత సుబేదార్ హోదా పొందాడు. 2022లో కేంద్ర ప్రభుత్వం అతడిని పద్మశ్రీతో సత్కరించింది.