Neeraj Chopra | కామన్వెల్త్ స్క్వాడ్‌లో నీరజ్ చోప్రా.. గురిందర్వర్ సింగ్‌కూ చోటు..!
Neeraj Chopra : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) కామన్వెల్త్ క్రీడలకు ఎంపికయ్యాడు. దోహా డైమండ్ లీగ్‌కు దూరమైన నీరజ్‌ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య(IAF) ఈ మెగా ఈవెంట్‌కు తీసుకుంది.
Neeraj Chopra : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) కామన్వెల్త్ క్రీడలకు ఎంపికయ్యాడు. దోహా డైమండ్ లీగ్‌కు దూరమైన నీరజ్‌ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య(IAF) ఈ మెగా ఈవెంట్‌కు తీసుకుంది. ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న చోప్రాపై భారీ అంచనాలే ఉన్నాయి. జూలై 23 నుంచి మొదలయ్యే కామన్వెల్త్ క్రీడల కోసం ఆదివారం 32 మందితో కూడిన అథ్లెటిక్స్ బృందాన్ని ప్రకటించింది ఏఎఫ్ఐ.
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలే లక్ష్యంగా ఫిట్నెస్ మెరగుపరచుకుంటున్న నీరజ్ చోప్రాకు స్క్వాడ్‌లో దక్కింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న ఈ జావెలిన్ త్రోయర్‌తో పాటు 32 మంది స్క్వాడ్‌లోకి ఎంపికయ్యారు. ఇటీవలే 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు బద్ధలు కొట్టిన గురిందర్‌వీర్ సింగ్, 200 మీటర్లతో రాణించిన అనిమేశ్ కుజుర్లు పతక వేటకు సిద్ధమవుతున్నారు.
SQUAD ANNOUNCEMENT 🚨
Our athletes are ready to represent the Tricolour at the Commonwealth Games 2026! 🇮🇳👊
NOTE ‘#’: Subject to their performance before Commonwealth Games 2026#CWG2026 #TeamIndia #IndianAthletics #AFI pic.twitter.com/DYRK7oGJPN
— Athletics Federation of India (@afiindia) June 14, 2026
కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్ స్క్వాడ్
గురిందర్‌వీర్ సింగ్ – 100 మీటర్లు
అనిమేశ్ కుమార్ – 200 మీటర్లు
గుల్వీర్ సింగ్ – 5000 మీటర్లు 10000 మీటర్లు
తేజస్ అశోక్ షిర్సే – 110 మీటర్ల హర్డిల్స్
యశస్ పి- 400 మీటర్ల హర్డిల్స్
సంతోష్ కుమార్ తమిలసరన్ – 400 మీటర్ల హర్డిల్స్
సర్వేశ్ అనిల్ కుషార, ఆదర్శ్ రామ్ జే, పూజ – హై జంప్
దేవ్ మీనా – పోల్ వాల్ట్
శ్రీ శంకర్ ఎమ్, లోకేశ్ సత్యనాథన్ – లాంగ్ జంప్
ప్రవీణ్ ఛిత్రవేల్, సెల్వా ప్రభు – ట్రిపుల్ జంప్
సమర్దీప్ సింగ్, తేజిందర్‌పాల్, మన్‌ప్రీత్ కౌర్ – షాట్ పుట్
నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్, యశ్ వీర్ సింగ్ – జావెలిన్ త్రో
తేజస్విన్ శంకర్ – డెకాథ్లాన్ హై జంప్
పరుల్ చౌదరీ – 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ 5000 మీటర్లు
సీమా పూనియా, నిధి రాణి – డిస్కస్ త్రో
రవీనా, ప్రియాంక – 10000 మీ రేస్ వాక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

