Neeraj Chopra : ఏడాది కాలంగా పలు పోటీలకు దూరమైన నీరజ్ చోప్రా(Neeraj Chopra) బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నాడు. వెన్ను గాయం నుంచి కోలుకుని ఫిటెనెస్ సాధించిన చోప్రా.. కామన్వెల్త్ క్రీడలకు ముందే ఈటెను విసరనున్నాడు. జూన్ 19 నుంచి మొదలయ్యే దోహా డైమండ్ లీగ్‌లో భారత స్టార్ పోటీ పడనున్నాడు. ఈ టోర్నీలో మెరిసి కామన్వెల్త్ క్రీడల్లో పతకం పట్టేయాలని చోప్రా భావిస్తున్నాడు.
భారత అథ్లెటిక్స్‌లో కొత్త చరిత్ర లిఖించిన నీరజ్ చోప్రా త్వరలోనే పునరాగమనం చేయనున్నాడు. చివరగా నిరుడు జపాన్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడిన చోప్రా.. దోహా డైమండ్ లీగ్‌లో ఆడనున్నాడు. స్విట్జర్లాండ్‌లో కోలుకుని, ఫిట్నెస్ మెరుగుపరచుకున్న జావెలిన్ త్రోయర్.. దేశం గర్వపడేలా చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
🚨 BIG NEW FOR INDIAN SPORTS FANS 🤩🔥
Olympian Neeraj Chopra will be competing at the Doha Diamond League on 19th June at 11:14 PM 💎
THE CHAMPION WILL BY FINALLY BACK ON FIELD pic.twitter.com/1hqI3ogUBA
— The Khel India (@TheKhelIndia) June 15, 2026
మొన్నటివరకూ చోప్రా రీ ఎంట్రీపై నెలకొన్న సందేహాలు పటాపంచలవ్వగా.. ప్రత్యర్థుల్లో కంగారు మొదలైంది. ఎందుకంటే నిరుడు ఇదే టోర్నీలో 90 మీటర్ల దూరం ఈటెను విసిరిన చోప్రా.. వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే కామెన్వెల్త్లో పతకం ఖాయమైనట్టే.
వరసగా రెండు ఒలింపిక్స్‌లో పసిడి, రజతంతో మెరిసిన నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడలకు ఎంపికయ్యాడు. దోహా డైమండ్ లీగ్‌కు దూరమైన నీరజ్‌ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య(IAF) ఈ మెగా ఈవెంట్‌కు తీసుకుంది. ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకున్న చోప్రాపై భారీ అంచనాలే ఉన్నాయి. జూలై 23 నుంచి మొదలయ్యే కామన్వెల్త్ క్రీడల కోసం ఆదివారం 32 మందితో కూడిన అథ్లెటిక్స్ బృందాన్ని ప్రకటించింది ఏఎఫ్ఐ.