న్యూఢిల్లీ: నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సురేంద్ర సింగ్ స్మారక షూటింగ్ చాంపియన్షిప్లో తెలుగు షూటర్, ఏపీకి చెందిన నేలవల్లి ముకేశ్ రెండు స్వర్ణ పతకాలతో మెరిశాడు.
25 మీటర్ల పిస్టల్ పురుషుల ఈవెంట్ లో సీనియర్, జూనియర్ రెండు విభాగాల్లోనూ 600కు గాను 584 (21x) పాయింట్లు స్కోరు చేసిన ముకేశ్ అగ్రస్థానాలతో బంగారు పతకాలు అందుకున్నాడు. కాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ 582 స్కోరుతో అగ్రస్థానం సాధించినా ఫైనల్కు గైర్హాజరైంది.