INDvsAUS T20I: రుతురాజ్ కొత్త చరిత్ర.. ఆసీస్‌తో మ్యాచ్‌లో రికార్డులే రికార్డులు
INDvsAUS T20I: ఈ మ్యాచ్‌లో శతకం సాధించడంతో ఆస్ట్రేలియాపై టీ20లలో భారత్ తరఫున తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. రుతురాజ్ కంటే ముందు ఆసీస్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వారిలో...
INDvsAUS T20I: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో గువహతి (బర్సపర) వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో 52 బంతుల్లో సెంచరీ చేసిన రుతురాజ్.. మొత్తంగా 57 బంతుల్లో 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో శతకం సాధించడంతో ఆస్ట్రేలియాపై టీ20లలో భారత్ తరఫున తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. రుతురాజ్ కంటే ముందు ఆసీస్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వారిలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2016లో కోహ్లీ.. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ.. 55 బంతుల్లో 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఆసీస్‌పై మెరుపు శతకంతో రుతరాజ్ మరిన్ని రికార్డులు బద్దలుకొట్టాడు. ఆస్ట్రేలియాపై పొట్టి ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ కూడా అతడే.. టీ20లలో భారత్ తరఫున ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతకుముందు శుభ్‌మన్ గిల్.. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులతో నాటౌట్ నిలిచాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో 123 రన్స్ చేయడం ద్వారా రుతురాజ్.. కోహ్లీ పేరిట అఫ్గానిస్తాన్‌పై 122 పరుగులు చేసిన రికార్డును బ్రేక్ చేశాడు. భారత్ తరఫున టీ20లలో అత్యధిక పరుగులు చేసినవారిలో గిల్, రుతురాజ్, కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (118), సూర్యకుమార్ యాదవ్ (117)లు ఉన్నారు.
History by Ruturaj.
– He becomes the first Indian to score hundred against Australia in T20I. 🇮🇳 pic.twitter.com/RJ5fGIchrf
— Johns. (@CricCrazyJohns) November 28, 2023
భారత క్రికెట్లో పొట్టి ఫార్మాట్లో ఇది 15వ సెంచరీ. రోహిత్ ఖాతాలో నాలుగు సెంచరీలుండగా సూర్య కుమార్ యాదవ్ మూడు, కెఎల్ రాహుల్ రెండు సెంచరీలు చేశారు. సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్‌లు రుతురాజ్ కంటే ముందున్నారు.
ICYMI – A @Ruutu1331 batting masterclass on display here in Guwahati.
Watch his three sixes off Aaron Hardie here 👇👇#INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/BXnQlOAMB0
— BCCI (@BCCI) November 28, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

