CM Mamata Banerjee | కోల్‌కతా, జూలై 24: ఇటీవల అసెంబ్లీ స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై గవర్నర్ రూ.500 జరిమానా విధించడంపై పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకొనేందుకు గవర్నర్ ఆనంద్ బోస్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘మీకు టిఫిన్‌కు డబ్బులు కావాలంటే, నన్ను అడగండి నేనిస్తా’ అంటూ గవర్నర్ ఆదేశాలపై చురకలు అంటించారు.
‘రాజ్‌భవన్ సెలెక్టెడ్, అసెంబ్లీ ఎలెక్టెడ్’ అనే విషయాన్ని గవర్నర్ గుర్తుంచుకోవాలన్నారు. నేరగాళ్లు, నీట్ స్కామ్ సూత్రదారులపై ఫైన్ వేయలేని ఆయన.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలపై ఫైన్ వేస్తున్నారని, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయకూడదని హితవు పలికారు. గవర్నర్ ఆదేశించిన విధంగా కాకుండా స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేయడం, అసెంబ్లీకి హాజరవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ టీఎంసీ ఎమ్మెల్యేలు సయంతికా బెనర్జీ, హుస్సేన్ సర్కార్‌పై రూ.500 జరిమానా విధిస్తూ రాజ్‌భవన్ సోమవారం ఇద్దరికి ఈమెయిల్ చేసిన విషయం తెలిసిందే.