న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, రాజకీయవేత్త నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu).. 33 కిలోల బరువు తగ్గారు. కేవలం 5 నెలల్లోనే ఆయన ఆ బరువు తగ్గినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. అధిక బరువు ఉన్నప్పుడు, తగ్గిన తర్వాత ఫోటోలను పెట్టారు. ఆగస్టు నుంచి 5 నెలల్లోనే 33 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొన్నారు. దృఢమైన సంకల్పం, పట్టుదల, ప్రాణాయామం, క్రమశిక్షణతో డయిట్ తీసుకోవడం వల్ల ఈ మార్పు సాధ్యమైందన్నారు. వెయిట్ ట్రైనింగ్, లాంగ్ వాకింగ్ చేయడం కీలకమైందన్నారు. సిద్దూ చేసిన ఇన్స్టా పోస్టుకు 10 వేల లైక్లు వచ్చాయి. చాలా మంది రియాక్ట్ అయ్యారు.