T20 World Cup 2026 : కొత్త ఏడాది ఆరంభంలోనే క్రికెట్ అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు పొట్టి ప్రపంచకప్ సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో మొదలయ్యే ఈ విశ్వ క్రీడా పోటీల కోసం అఫ్గనిస్థాన్ (Afghanistan) సెలెక్టర్లు స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి ఐదుగురు ఆల్‌రౌండర్లతో పటిష్టమైన బృందాన్ని ప్రకటించారు. రషీద్ ఖాన్ (Rashid Khan) కెప్టెన్‌గా 15మందితో కూడిన స్క్వాడ్న వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది.
టీ20ల్లో సంచలన విజయాలకు కేరాఫ్ అయిన అఫ్గనిస్థాన్ ఈసారి ప్రపంచకప్‌లో సత్తా చాటాలనుకుంటోంది. రెండేళ్ల క్రితం రషీద్ ఖాన్ సారథ్యంలో పాకిస్థాన్‌కు షాకిచ్చిన కాబూలీ టీమ్.. సెమీస్ వరకూ వెళ్లింది. ఈసారి అంతకుమించి అంటే ఫైనల్, అదృష్టం కలిసొస్తే తొలి ఐసీసీ టైటిల్ ఒడిసిపట్టాలని రషీద్ సేన పట్టుదలతో ఉంది. ఉపఖండంలో, ఐపీఎల్లో ఆడని అనుభమున్న రషీద్, నబీ, నూర్ అహ్మద్, రహ్మనుల్లా గుర్బాజ్, ఒమర్జాయ్ వంటి ఆల్‌రౌండర్లు అఫ్గనిస్థాన్‌కు కొండంత బలం కానున్నారు.
Rashid Khan will be at the helm for Afghanistan at the #T20WorldCup 👌
More on the squad 👉 https://t.co/zBZO20AJXv pic.twitter.com/8KeuSpMMKk
— ICC (@ICC) December 31, 2025
ఫిబ్రవరిలో మొదలయ్యే పొట్టి ప్రపంచకప్ కోసం వికెట్ కీపర్లుగా రహ్మనుల్లా గుర్బాజ్, మొహమ్మద్ ఇషాక్ ఎంపికయ్యారు. బౌలింగ్ విభాగంలో మిస్టరీ స్పిన్నర్ నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫజల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఉన్నారు. మెగా టోర్నీ గ్రూప్ దశలో ఫిబ్రవరి 8న న్యూజిలాండ్‌ను రషీద్ సేన ఢీకొట్టనుంది.
అఫ్గనిస్థాన్ టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెదీకుల్లా అటల్, ఫజల్ హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్, మొహమ్మద్ ఇషాక్, షహీదుల్లా కమల్, మొహమ్మద్ నబీ, గుల్బదిన్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, డార్విష్ రసూలి. ఇబ్రహీం జర్దానీ.