హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్పూర్ వేదికగా జరిగిన 19వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్లు సత్తా చాటారు. రాష్ర్టానికి చెందిన యువ అథ్లెట్ సాయి కిరణ్ షాట్‌పుట్‌లో స్వర్ణం సాధించగా హెప్టథ్లాన్లో మన అమ్మాయి శ్రీతేజ మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది.
పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో సాయికిరణ్.. ఇనుపగుండును 18.36 మీటర్లు విసిరి పసిడి దక్కించుకుని రాష్ర్టానికి తొలి పతకాన్ని అందించాడు. ఇక శ్రీతేజ.. 4,136 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. రిని ఖాటూన్ (పశ్చిమబెంగాల్- 4,357), దుర్గాశ్రీ దినేశ్ (తమిళనాడు – 4,158) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. తెలంగాణకే చెందిన కేతావత్ సింధు.. 3,680 పాయింట్లతో ఏడో స్థానం దక్కించుకుంది.