ఖైరతాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ అసోసియేషన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి ఎల్బీ స్టేడియంలో సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ జరుగనుంది. ‘హింద్ కేసరి -2022’పేరిట నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించిన వివరాలను నిర్వహణ కమిటీ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గురువారం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ద్రోణాచార్య అవార్డీ దివంగత రోషన్‌లాల్, విజయ్ కుమార్ యాదవ్ స్మారకార్థం ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నిర్వహణ కమిటీ ప్రతినిధులు అభిమన్యు యాదవ్, నవీన్ యాదవ్, ఆదిత్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.