జూబ్లీహిల్స్: తమిళనాడు వేదికగా ఈ నెల 25 నుంచి 27 వరకు జరుగనున్న 3వ జాతీయ సిలంబం(కర్రసాము) టోర్నీలో తెలంగాణ నుంచి 17 మంది బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర జట్టులో కార్తీక్, త్రిభువన్ శర్మ, సాయికుమార్, రవితేజ, గౌతమ్, అరుణ్, రుషికాంత్రెడ్డి, శ్రీకాంత్, ప్రసాద్, విష్ణుప్రియ, వరెణ్య, ధన్వి, మిథున్‌కుమార్, శ్రవణ్‌కుమార్, కీర్తి, రిషికుమార్, కల్యాణి ఉన్నారు. వీరంతా గురువారం తమిళనాడుకు బయల్దేరి వెళ్తారని సిలంబం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాల్‌రాజు తెలిపారు.