Abha Khatua | భువనేశ్వర్: మహారాష్ట్ర అథ్లెట్ అభా ఖటువ షాట్‌పుట్‌లో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలలో భాగంగా సోమవారం అభా.. షాట్‌పుట్‌ను 18.41 మీటర్ల దూరం విసిరి కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. గతంలో అభా.. మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి 18.06 మీటర్ల రికార్డును పంచుకుంది. ఈ ప్రదర్శనతో ఆమె ఒలింపిక్ అర్హత (18.80 మీటర్లు)కు కొద్దిదూరంలోనే నిలిచింది. షాట్ పుట్ విభాగంలో ఇప్పటిదాకా ఒక్క మహిళా అథ్లెట్ కూడా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు.