Karate Tournament | హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా గురువారం నుంచి కేఐవో ఆలిండియా కరాటే చాంపియన్షిప్ మొదలుకానుంది. సాట్స్, కరాటే ఇండియా ఆర్గనైజేషన్(కేఐవో)కు అనుబంధంగా ఉన్న తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్(టీఎస్కేడీఏ) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు టోర్నీ జరుగనుంది. ఇందులో 1500 మందికి పైగా కరాటే ప్లేయర్లు అండర్-21, సీనియర్, పారా విభాగాల్లో పోటీపడనున్నారు.