మరిపెడ, జనవరి 20: మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఇండోర్ స్టేడియంలో జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని వివిధ అకాడమీల నుంచి పలువురు ప్లేయర్లు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. శుక్రవారం అండర్-17 విభాగంలో సింగిల్స్, డబుల్స్ కలిపి మొత్తం 12 మ్యాచ్‌లు జరిగాయి.
సింగిల్స్ విభాగంలో కౌశిక్(డీఎంఆర్సీ అకాడమీ), ప్రవీణ్ సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. డబుల్స్‌లో శ్రీవల్లి(వీబీఏ అకాడమీ), అభిషేక్, సాయి శ్రేయాన్ (హర్ష స్పోర్ట్స్ అకాడమీ) సెమీస్‌లోకి ప్రవేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు నేతృత్వంలో ప్లేయర్లకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు.