Hardhik Pandya | పాండ్యాతో విడాకులు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన స్టాంకోవిక్
Hardhik Pandya | భారత జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya), నటాషా స్టాంకోవిక్(Natasha Stankovic) దంపతులు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విడాకుల రూమర్స్‌కు నటాషా తాజాగా ఓ ట్విస్ట్ ఇచ్చింది.
Hardhik Pandya | భారత జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya), నటాషా స్టాంకోవిక్(Natasha Stankovic) దంపతులు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం వీరి విడాకుల గురించే పెద్ద చర్చ జరుగుతోంది. నటాషా తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తమ వెడ్డింగ్ ఫోటోలను తొలగించడంతోపాటు, తన పేరు పక్కన పాండ్యా అనే సర్ నేమ్‌ను కూడా తొలగించింది. దీంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. అయితే.. విడాకుల వార్తలపై అటు నటాషాగానీ, ఇటు పాండ్యాగానీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఈ జంట విడిపోతుందనే పుకార్లకు మరింత బలం చేకూర్చేలా చేసింది. ఈ క్రమంలోనే విడాకుల రూమర్స్‌కు నటాషా తాజాగా ఓ ట్విస్ట్ ఇచ్చింది. తమ పెళ్లినాటి ఫొటోలను ఇన్‌స్టాలో తిరిగి రిస్టోర్ (restores wedding pics) చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ ‘ఎప్పటికీ ఇద్దరూ కలిసే ఉండండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. ఈ మధ్యే నటాషా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పాండ్యా పేరును తొలిగించింది. అంతేకాదు ‘ఒకరు త్వరలోనే వీధుల్లోకి రానున్నారు’ అని పోస్ట్ కూడా పెట్టింది. ఆ పోస్ట్ అంతరార్థం ఈ జంట కథ కంచికి చేరినట్టేనని సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. గత కొంతకాలంగా పాండ్యా, నటాషాలు వ్యక్తిగత ఫొటోలు షేర్ చేయడం లేదు. నటాషా పుట్టిన రోజున కూడా పాండ్యా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఇక అదే సమయంలో ఇప్పటివరకు జరిగిన గత రెండు ఐపీఎల్‌లలో నటాషా స్టాంకోవిచ్ స్టేడియానికి వచ్చి హార్దిక్‌ను ఉత్సాహపరిచింది.
కానీ ఈ ఏడాది ఐపీఎల్లో మాత్రం నటాషా ఏ స్టేడియంలోనూ కనిపించలేదు. దాంతో, ఇద్దరి మధ్య దూరం పెరిగిందని, త్వరలోనే విడాకులు తీసుకోవడం ఖాయమని అనుకుంటున్నారంతా. ఒకవేళ అదే జరిగితే డైవర్స్ సెటిల్మెంట్ కింద పాండ్యా తన సంపాదనలో సగానికి పైగా అంటే 70 శాతం సమర్పించుకోవాల్సి ఉంటుందన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే నటాషా తాజాగా ట్విస్ట్ ఇచ్చింది. తన పెళ్లి ఫొటోలను, ప్యాండ్యాతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో రీస్టోర్ చేసి విడాకుల రూమర్స్‌కు తెరదించింది. నటాషా ట్విస్ట్‌తో ఇప్పటికైనా వీరి విడాకుల రూమర్స్‌కు పులుస్టాప్ పడుతుందో లేదో చూడాలి మరి.
ప్రేమికుల రోజున రెండోసారి
స్పెయిన్ మోడల్ అయిన నటాషాకు, పాండ్యాకు కరోనా సమయం(Corona Time)లోపెళ్లి అయింది. ప్రస్తుతం ఈ జంటకు అగస్త్య (Agastya) అనే పిల్లాడు ఉన్నాడు. అయితే.. హార్దిక్ – నటాషాలు ఈ మధ్యే రెండోసారి వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. కొడుకు ఉన్నాక మళ్లీ పెండ్లి చేసకోవడానికి కారణం ఎంటో తెలుసా..? 2020 మార్చి 31న అతికొద్ది మంది సమక్షంలో కోర్టులో హార్దిక్, నటాషాల పెళ్లి జరిగింది. అది కరోనా టైమ్ కావడంతో సాదాసీదాగా వీళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.
అయితే… పరిస్థితులు చక్కబడ్డాక బంధు, మిత్రుల ముందు వైభవంగా మనువాడాలని హార్దిక్, నటాషాలు అప్పుడే నిర్ణయించుకున్నారు. అందుకు ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ముహూర్తం పెట్టుకున్నారు. ఉదయ్‌పూర్ వేదికగా కన్నులపండువగా వీళ్లు రెండోసారి వివాహం చేసుకున్నారు. తమ కుమారుడు అగస్త్యను ఎత్తుకొని మురిసిపోతూ ఫొటోలు దిగారు. అనుకున్నట్టుగానే తమ పెళ్లిని అందమైన జ్ఞాపకంగా మలచుకున్నారు.
Also Read..
Sonia Gandhi | జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారే : సోనియా గాంధీ
Mother Dairy | అమూల్ బాటలోనే మదర్ డెయిరీ.. లీటరు పాలపై రూ.2 పెంపు
Akasa Air | ఢిల్లీ – ముంబై విమానానికి సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌కు మళ్లింపు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

