Most Valuable Player : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వస్తుందంటే చాలు ఆటగాళ్లపై అంచనాలు పెరిగిపోతాయి. విధ్వంసక ఆటతో రెచ్చిపోయే పోటుగాళ్ల .. ఈసారి తమ తడాఖా చూపిస్తారా? అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. అంతేకాదు ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసేది ఎవరు? వికెట్ల వేటతో పర్పుల్ క్యాప్ తన్నుకుపోయేది ఎవరు? వంటి చర్చలు ఊపందుకుంటాయి. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డును కొల్లగొట్టేది ఎవరు? అనే అంశం కూడా ప్రధానమైంది. గత పద్దెనిమిది సీజన్లలో సునీల్ నరైన్ మూడుసార్లు.. రస్సెల్, షేన్ వాట్సన్‌లు మాత్రమే రెండు పర్యాయాలు ఈ అవార్డును గెలుపొందారు. మరి.. ఇప్పటివరకూ ఎంవీపీలుగా నిలిచిన వారెవరో చూద్దాం.
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి పద్దెనిమిదో ఎడిషన్ వరకూ ఎందరో స్టార్ ఆటగాళ్లను చూశాం. కానీ, నిలకడగా రాణించి అత్యంత విలువైన ఆటగాడిగా అవతరించింది మాత్రం కొందరే. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ ఏకంగా మూడుసార్లు ఈ అవార్డను గెలుపొందాడు. షేన్ వాట్సన్, ఆండ్రూ రస్సెల్ రెండేసి దఫాలు అత్యంత విలువైన ఆటగాళ్లుగా నిలిచారు.
SKY had a stellar 2025 IPL 🌟
Who’s your MVP this year? pic.twitter.com/dcgL32zJSe
— ESPNcricinfo (@ESPNcricinfo) March 21, 2026
బీసీసీఐ తొలిసారిగా 2008లో నిర్వహించిన ఐపీఎల్ దుమ్మురేసిన షేన్ వాట్సన్(రాజస్థాన్ రాయల్స్) మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. దివంగత షేన్ వార్న్ సారథ్యంలో రాజస్థాన్ టైటిల్ గెలుపొందడంలో కీలకమైన వాట్సన్ అత్యంత విలువైన ఆటగాడిగా అవతరించాడు. ఆ తర్వాతి ఎడిషన్‌లో దక్కన్ ఛార్జర్స్‌ను విజేతగా నిలిపిన ఆడం గిల్‌క్రిస్ట్ ఈ అవార్డును ఎగరేసుకపోయాడు. 2010లో సచిన్ టెండూల్కర్(ముంబై ఇండియన్స్), 2011లో క్రిస్ గేల్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), 2012లో సునీల్ నరైన్(కేకేఆర్), 2013లో షేన్ వాట్సన్ (రాజస్థాన్ రాయల్స్),
𝗠𝗩𝗣 = 𝐒𝐊𝐘 👏
The highly consistent Surya Kumar Yadav wins the Most Valuable Player Award 💙#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @surya_14kumar pic.twitter.com/ZOgcBD0Xwb
— IndianPremierLeague (@IPL) June 3, 2025
2014లో గ్లెన్ మ్యాక్స్‌వెల్(కింగ్స్ లెవన్ పంజాబ్), 2015లో ఆండ్రూ రస్సెల్(కేకేఆర్), విరాట్ కోహ్లీ(ఆర్సీబీ) 2016లో, 2017లో బెన్ స్టోక్స్(రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్), 2018లో సునీల్ నరైన్(కేకేఆర్), 2019లో ఆండ్రూ రస్సెల్(కేకేఆర్), 2020లో జోఫ్రా ఆర్చర్(రారా), 2021లో హర్షల్ పటేల్(ఆర్సీబీ), 2022లో జోస్ బట్లర్(రారా), శుభ్‌మన్ గిల్(గుటై), 2024 సునీల్ నరైన్, 2025లో సూర్యకుమార్ యాదవ్(ముంబై ఇండియన్స్) విధ్వంసక ఆటతో అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డు అందుకున్నాడు.