IPL 2024 KKR vs DC : వైజాగ్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్(85) హాఫ్ సెంచరీ బాదాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించిన నరైన్.. కోల్‌కతా స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించి 85 పరుగుల వద్ద మార్ష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోఎండ్‌లో అంగ్క్రిష్ రాఘువంశీ సైతం రెచ్చిపోతున్నాడు. ఈ చిచ్చరపిడుగు 23 బంతుల్లోనే 48 రన్స్ కొట్టాడు. దాంతో, కోల్‌కతా స్కోర్ 12 ఓవర్లకు 160 దాటింది.
కోల్‌కతా ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(15) ఉన్నంత సేపు ఉతికేశాడు. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌తో మొదలైన అతడి బౌండ్రీల మోత ఇంకా కొనసాగుతోంది. దాంతో, కోల్‌కతా రెండొందలు కొట్టే చాన్స్ ఉంది. 12.3 ఓవర్లకు కోల్‌కతా రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.