హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ నరేంద్ర రామ్ నియమితులయ్యారు. లైఫ్‌స్పాన్ ఇండస్ట్రీస్, లైఫ్‌స్పాన్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడైన నరేంద్ర రామ్.. మూడేండ్ల (2025-2028 వరకూ) పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
అధ్యక్షుడిగా నియమితుడైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రగ్బీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.