హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాంశ్ చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లాస్లో పోల్గర్ బుక్ ‘5334 ప్రాబమ్స్ అండ్ గేమ్స్’ నుంచి తీసుకున్న 175 చెక్‌మేట్ పజిల్స్‌ను దేవాంశ్ 11నిమిషాల 59సెకన్ల వ్యవధిలో పరిష్కరించడంలో సఫలీకృతమయ్యాడు. ఈనెల 18న హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫీట్‌ను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్) ప్రతినిధులు గుర్తించి సర్టిఫికేట్ అందజేశారు.
దీనికి తోడు ఇటీవల దేవాంశ్ మరో రెండు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 7డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం నిమిషం 43సెకన్లలో పూర్తిచేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 పావులను వేగవంతంగా సరైన స్థానాల్లో నిలిపాడు. ప్రపంచ రికార్డు ప్రయత్నాలను లండన్ ప్రతినిధులు గుర్తించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దేవాంశ్ ప్రదర్శన పట్ల లోకేశ్ సంతోషం వ్యక్తం చేశాడు.