అబుధాబి: టీ20 ప్రపంచకప్‌లో పసికూనల సమరానికి సమయం ఆసన్నమైంది. ఐర్లాండ్, నెదర్లాండ్స్ వంటి జట్లకు షాకిచ్చి అనూహ్యంగా సూపర్-12 దశకు చేరిన నమీబియా, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆరంభం నుంచే నమీబియా బౌలర్లపై ఒత్తిడి పెంచాలనుకున్న స్కాట్లాండ్ జట్టు ఆశలు తొలి ఓవర్లోనే ఆవిరయ్యాయి. రూబెన్ ట్రంపుల్మన్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికే స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సే (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్ మూడో బంతికి కాలమ్ మెక్లాయిడ్ (0) కూడా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
ఆ మరుసటి బంతికే రిచీ బెర్రింగ్టన్ (0) కూడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఇలా ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ గోల్డెన్ డక్‌గా వెనుతిరగడంతో స్కాట్లాండ్కు కోలుకోలేని దెబ్బతగిలింది. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఈ రెండు పరుగులు కూడా రూబెన్ వేసిన వైడ్లు కావడం గమనార్హం.