అబుధాబి: స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో నమీబియా ఓపెనర్లు చాలా ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. 110 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన నమీబియా ఓపెనర్లు క్రెయిగ్ విలియమ్స్ (5 నాటౌట్), మైకేల్ వాన్ లింగెన్ (18 నాటౌట్) ఒక మోస్తరు ఆరంభాన్ని అందించారు.
అయితే ఆరో ఓవర్లో లింగెన్ను సఫ్యాన్ షరీఫ్ అవుట్ చేశాడు. అతని స్థానంలో వికెట్ కీపర్ జేన్ గ్రీన్ క్రీజులోకి వచ్చాడు. మొత్తానికి ఆచితూచి ఆడుతున్న నమీబియా జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి 28 పరుగులు చేసింది.