హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీలోక్నాథ్ సమల్ స్మారక 8వ తెలంగాణ అంతర్‌జిల్లాల టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో నాగుపల్లి భవిత, జతిన్‌దేవ్ విజేతలుగా నిలిచారు. అండర్-19 బాలుర విభాగంలో జతిన్ ప్రత్యర్థులపై అలవోక విజయాలతో టాప్‌లో నిలువగా, బాలికల కేటగిరీలో భవిత ఓటమన్నదే ఎరుగకుండా అగ్రస్థానంలో నిలిచింది. అండర్-13 విభాగంలో అక్షయ్, సత్య చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.