ICC U19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ నిర్వహిస్తున్న అండర్ – 19 వరల్డ్ కప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. యువభారత జట్టులోని వన్ డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ (106 బంతుల్లో 118, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) తో పాటు కెప్టెన్ ఉదయ్ సహరన్ (84 బంతుల్లో 75, 5 ఫోర్లు) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 301 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా అండర్ – 19కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (17) విఫలమవగా మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (32) ఫర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ముషీర్, ఉదయ్‌లు వికెట్లకు అడ్డుగోడలా నిలిచారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.
Innings break!
Solid batting display from the #BoysinBlue as #TeamIndia post 301/7 in the first innings 👌👌
💯 from Musheer Khan and a Captain’s knock from Uday Saharan 👏👏
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/x26Ah72jqU#TeamIndia | #INDvIRE | #U19WorldCup pic.twitter.com/Lvu6aJR194
— BCCI (@BCCI) January 25, 2024
గత మ్యాచ్‌లో మాదిరిగానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ఉదయ్.. ఫిన్ లటన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వంద బంతుల్లో సెంచరీ పూర్తిచేసిన ముషీర్.. ఆ తర్వాత ధాటిగా ఆడబోయి పెవిలియన్ చేరాడు. ఆఖర్లో తెలంగాణ కుర్రాడు ఎరవెల్లి అవినాశ్.. (13 బంతుల్లో 22, 3 ఫోర్లు), సచిన దాస్ (9 బంతుల్లో 21, 2 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ౠడి భారత స్కోరును 300 మైలురాయిని దాటించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఒలీవర్ రిలే మూడు వికెట్లు తీయగా జాన్ మెక్నాలీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇదివరకే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన భారత్.. నేడూ గెలిస్తే సూపర్ 6 దశకు చేరుతుంది.