హైదరాబాద్, ఆట ప్రతినిధి : హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘సీ’ డివిజన్ వన్డే లీగ్‌లో మురళీ అక్షిత్ అదరగొట్టాడు. సోమవారం హైదరాబాద్ జిల్లా టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో పికెట్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 243 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పికెట్ వికెట్ నష్టపోయి 41.5 ఓవర్లలో విజయాన్నందుకుంది. ఓపెనర్ గూడురు మురళీ అక్షిత్ (140 బంతుల్లో 146 నాటౌట్, 22ఫోర్లు) సెంచరీతో అదరగొట్టాడు. దూకుడుగా ఆడిన అక్షిత్ తన ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు హైదరాబాద్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 242/4 స్కోరు చేసింది.