Ranji Trophy 2024 | ముషీర్ ఖాన్ సెంచరీ.. సచిన్ చూస్తుండగానే అతడి రికార్డు బద్దలు కొట్టిన ముంబైకర్
Ranji Trophy 2024 | విదర్భతో జరుగుతున్న ఫైనల్లో ముషీర్.. 326 బంతులాడి 10 బౌండరీల సాయంతో 136 పరుగులు చేశాడు. తద్వారా ముషీర్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 29 ఏండ్ల కిందట నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు.
Ranji Trophy 2024 | ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో భారత యువ క్రికెటర్, సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ శతకంతో అదరగొట్టాడు. విదర్భతో జరుగుతున్న ఫైనల్లో ముషీర్.. 326 బంతులాడి 10 బౌండరీల సాయంతో 136 పరుగులు చేశాడు. తద్వారా ముషీర్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 29 ఏండ్ల కిందట నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ మ్యాచ్ చూస్తుండగానే ముషీర్ ఈ ఘనత సాధించడం గమనార్హం.
విదర్భతో మ్యాచ్‌లో సెంచరీ చేసిన ముషీర్ వయసు 19 ఏండ్ల 14 రోజులు. రంజీ ట్రోఫీ ఫైనల్స్‌లో ముంబై తరఫున ఆడుతూ అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఘనత సచిన్ పేరు మీద ఉంది. 1994-95 సీజన్లో సచిన్.. రంజీ ఫైనల్లో (పంజాబ్‌పై) ఆడుతూ ఈ ఘనత అందుకున్నాడు. అప్పటికీ సచిన్ వయసు 21 ఏండ్ల 11 నెలలు. తాజాగా ముషీర్.. ఈ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం.
ముషీర్ సెంచరీ సాయంతో రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై భారీ స్కోరు దిశగా కదులుతోంది. మూడో రోజు టీ విరామ సమయానికి ముంబై.. 6 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ తో పాటు కెప్టెన్ అజింక్యా రహానే (73), శ్రేయస్ అయ్యర్ (95)లు రాణించారు. టీ విరామానికి ముంబై ఆధిక్యం 476 పరుగులుగా ఉంది. ఆ జట్టు 500 ప్లస్ టార్గెట్ నిర్దేశించి డిక్లేర్ చేసే అవకాశముంది. చివరి రెండు రోజులు బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే వాంఖడే పిచ్‌పై అంత భారీ టార్గెట్‌ను ఛేదించడం ముంబైకి శక్తికి మించిన పనే..
Century for Musheer Khan 💯👏
A gritty knock from the youngster under pressure 💪#RanjiTrophy | @IDFCFIRSTBank | #Final | #MUMvVID
Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/bnu7C87qZP
— BCCI Domestic (@BCCIdomestic) March 12, 2024
ఫైనల్ చూసిన అతిరథులు..
వాంఖడే వేదికగా జరుగుతున్న రంజీ ఫైనల్ మ్యాచ్‌ను క్రికెట్ దిగ్గజాలు వీక్షించారు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు దిలీప్ వెంగ్‌సర్కార్, చంద్రకాంత్ పండిట్, రోహిత్ శర్మలు మ్యాచ్‌ను గ్యాలరీ నుంచి చూశారు. సచిన్, వెంగ్‌సర్కార్, చంద్రకాంత్‌లు ముంబై జట్టుకు ఆడినవాళ్లే. చంద్రకాంత్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అయిపోయాక ధర్మశాల నుంచి ముంబైకి వచ్చిన రోహిత్.. నేడు మ్యాచ్‌ను వీక్షించాడు. బీసీసీఐ ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ (ఎక్స్) లో షేర్ చేసింది.
A legendary presence at the Wankhede Stadium 🏟️ 🙌@sachin_rt | #RanjiTrophy | @IDFCFIRSTBank | #Final | #MUMvVID
Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/i5bSQlGcmO
— BCCI Domestic (@BCCIdomestic) March 12, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

