IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి సీజన్లో కొత్త తారలు పుట్టుకొస్తుంటారు. ఈసారి కూడా కొందరు కుర్రాళ్లు అరంగేట్రంలోనే తమ సంచలన ప్రదర్శనతో జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. ముంబై ఇండియన్స్(Mumbai Indians) స్క్వాడ్‌లో అలాంటి యువకెరటాలు ఇద్దరున్నారు. ఒకరు స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ కాగా.. మరొకరు పేస్ సంచలనం అశ్వనీ కుమార్(Ashwani Kumar). 18వ సీజన్లో వరుస పరాజయాలతో అల్లాడుతున్న ముంబై జట్టు వాంఖడేలో అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడీ 23 ఏళ్ల పేస్ గన్. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లను వణికిస్తూ 4 వికెట్లతో చెలరేగిన అశ్వనీ ఒక పేదింటి బిడ్డ.
ఐపీఎల్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్న అశ్వనీది పంజాబ్. క్రికెటర్ అవ్వాలనుకున్న అతడి కలను నిజం చేసేందుకు అతడి తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. ‘మాది పేద కుటుంబం. అయినా సరే మా అబ్బాయి కలను సాకారం చేయాలనుకున్నాం. మా స్థోమతకు మించిన ఖర్చు అని తెలిసినా సరే.. మా కుమారుడిని మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అకాడమీ(PCA)లో చేర్పించాం.
Topping the fantasy points charts – Ashwani, Ryan & Deepak 📈
Paltan, which of these 🔥 performers made into your @Dream11 team? 👀#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/R6pzLZfpUE
— Mumbai Indians (@mipaltan) April 1, 2025
మా ఇంటి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉండేది స్టేడియం. రోజూ సైకిల్ తొక్కుతూ స్టేడియం వెళ్లేవాడు. లేదంటే.. ఎవరినైనా లిఫ్ట్ ఆడిగేవాడు. కొన్నిసార్లు ఆటోలో స్టేడియానికి వెళ్లేవాడు. ఆటో కిరాయికి రూ.30 మాత్రమే ఇచ్చేవాడిని. మా కుటుంబ పరిస్థితి తెలిసిన అశ్వనీ ఎంతో కష్టపడి బౌలింగ్‌లో రాటుదేలాడు. వర్షం పడినా.. ఎండలు దంచినా ఏ రోజు కూడా ప్రాక్టీస్ మానేయలేదు. దేశవాళీలో అదరగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు’ అని అతడి తండ్రి హర్కేశ్ కుమార్ వెల్లడించాడు.
No bigger FLEX than winning P.O.T.M. on your MI & IPL debut! 😍#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvKKR pic.twitter.com/OooahzHVlw
— Mumbai Indians (@mipaltan) March 31, 2025
అరంగేట్రంలోనే 4-24తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అశ్వనీకి నచ్చిన ఫుడ్ ఏంటో తెలుసా?.. ఆలూ పరాటా. ఈ విషయం వాళ్ల అమ్మ చెప్పింది. ‘మా అబ్బాయికి ఆలూ పరాటా అంటే ఇష్టం. అంతేకాదు శనగపిండితో చేసిన రొట్టెలు కూడా ఆవురుమంటూ లాగించేస్తాడు. ఐపీఎల్లో మా కుమారుడి బౌలింగ్‌ను అందరు పొగుడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరు ఝంజేరిలోని ప్రతి ఒక్కరు అశ్వనీ ప్రతిభను కొనియాడుతున్నారు’ అని అమ్మ మీనా కుమారి తెలిపింది. నిరుడు షేర్ ఏ పంజాబ్ టోర్నమెంట్లో అశ్వనీ పంజాబ్ జట్టు బ్యాకప్ బౌలర్‌గా ఎంపికయ్యాడు.
A spell straight out of dreams! 🔮✨
Ashwani delivers the best figures by an Indian bowler on debut! 🤯#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvKKR pic.twitter.com/XXAH7o5qID
— Mumbai Indians (@mipaltan) March 31, 2025
నెట్స్‌లో అతడి బౌలింగ్ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ స్కౌట్స్ బృందం దృష్టిలో పడ్డాడు. నిక్కచ్చిగా పదునైన యార్కర్లు వేసే అతడిని దుబాయ్‌లో జరిగిన మెగా వేలంలో రూ.30 లక్షలు పెట్టి కొనేసింది నీతా అంబానీ టీమ్. ముంబై నెట్స్‌లో అశ్వనీ సమర్థంగా బంతిని స్వింగ్ చేయడం గమనించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా… అతడికి కోల్‌కతాతో మ్యాచ్‌లో డెబ్యూట్ క్యాప్ అందించానని మ్యాచ్ అనంతరం చెప్పాడు. పేస్ సెన్సేషన్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఈ పంజాబీ కుర్రాడు తర్వాతి మ్యాచుల్లోనూ సత్తా చాటాలని మనసారా కోరుకుందాం.