హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో ముంబై మీటియర్స్ గెలుపు జోరు కొనసాగుతున్నది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై 3-2(15-7, 7-15, 13-15, 15-8, 15-11)తో కొచ్చి బ్లూస్పైకర్స్పై అద్భుత విజయం సాధించింది. టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ముంబై.. మ్యాచ్‌లో ఆది నుంచే తమదైన ఆధిపత్యం కొనసాగించింది.
తొలి సెట్‌ను 15-7తో దక్కించుకున్న ముంబైకి రెండు, మూడు సెట్లలో చుక్కెదురైంది. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ముంబై వరుస సెట్లలో కొచ్చిని చిత్తు చేస్తూ మ్యాచ్‌ను తమ వశం చేసుకుని సెమీస్ బెర్తుకు మరింత చేరువైంది. మరో మ్యాచ్‌లో గోవా 3-0తో కోల్‌కతాపై గెలిచింది.