హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్లో ముంబై మీటియర్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గ్రూప దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై.. శుక్రవారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగించి.. 15-8, 15-8, 16-14తో గోవా గార్డియన్స్‌పై విజయం సాధించింది. అహ్మదాబాద్ డిఫెండర్స్, బెంగళూరు టార్ఫెడోస్ తలపడే రెండో సెమీస్‌లో విజేతతో ముంబై ఆదివారం ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.