ముంబై: ఐపీఎల్ 2023 సీజన్-16లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య 22వ మ్యాచ్ జరుగుతున్నది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మరో రెండు మ్యాచ్లలో ఓటమి పాలైంది.
కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ మొత్తం 4 మ్యాచ్లు ఆడి రెండింట గెలిచి, మరో రెండింట ఓటమి పాలైంది. కడుపునొప్పి (Stomuch Bug) కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.