Mumbai Indians : ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్రతి సీజన్లో ఫేవరెట్టే. కానీ, ఈ దిగ్గజ జట్టను ఆరంభ మ్యాచ్ ఫోబియా వెంటాడుతోంది. ప్రతి ఎడిషన్‌లో ఓపెనింగ్ గేమ్ అంటే చాలు ముంబై వణికిపోతుంది. తొలి ఎడిషన్ నుంచి ఇప్పటివరకూ నాలుగే నాలుగు విజయాలు సాధించిన ముంబై.. పంతొమ్మిదో సీజన్‌ను గెలుపుతో మొదలెట్టాలనే పట్టుదలతో ఉంది. లీగ్ దశ మొదటి మ్యాచ్‌లో ఐదో విజయంపై కన్నేసిన హార్దిక్ పాండ్యా సేన ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)తో తలపడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తిరుగులేని జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. తమ కంచుకోట వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముంబై ఢీ కొడుతోంది. ఐపీఎల్ చరిత్రలో ఓపెనింగ్ మ్యాచ్‌లో ఈ ఛాంపియన్ జట్టుకు గొప్ప రికార్డేమీ లేదు. 2008 ఎడిషన్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై.. ఆ తర్వాత వరుసగా నాలుగు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్‌ను విజయంతో ముగించింద.
Mumbai Indians fans, 🤞 for the season opener? #IPL2026 pic.twitter.com/B6KUVdSdXn
— ESPNcricinfo (@ESPNcricinfo) March 29, 2026
కానీ, 2013లో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆ ఎడిషన్ నుంచి పద్దెనిమిదో సీజన్ వరకూ అన్నింటా ఓడిపోతూనే ఉంది. కెప్టెన్ మారినా రాత మారలేదు అన్నట్టుగా హార్దిక్ పాండ్యా సైతం ముంబైని ఆరంభ పోరులో గెలిపించలేకపోయాడు. మరి.. ఈసారి సొంత మైదానంలో కోల్‌కతాకు చెక్ పెట్టి బోణీ కొడుతుందా? ఎప్పటిలానే పరాజయాల పరంపరను కొనసాగిస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది.
𝑴𝑨𝑻𝑪𝑯𝑫𝑨𝒀 𝑺𝑾𝑨𝑮 🆙 pic.twitter.com/U8S3RDqCVs
— Mumbai Indians (@mipaltan) March 29, 2026
ఓపెనింగ్ మ్యాచ్ సన్నద్ధత గురించి ముంబై హెడ్‌కోచ్ మహేల జయవర్దనే మాట్లాడుతూ అన్ని మ్యాచుల్లానే మొదటి మ్యాచ్‌కు సిద్ధమవుతామని అన్నాడు. ‘సీజన్లో మొదటి మ్యాచ్ అనేది ఒక సమస్యే. అలాఅనీ మేము కొత్తగా ఏమీ సన్నద్ధం కాము. మొదటి మ్యాచ్‌లో ఉండే ఒత్తిడి తీవ్రత గురించి ఆటగాళ్లతో ఇదివరకే మాట్లాడాను. మంచి క్రికెట్ ఆడాలని చెప్పాను.
▶️ https://t.co/Nm0UEsptla pic.twitter.com/FGenFoYxD8
— ESPNcricinfo (@ESPNcricinfo) March 29, 2026
ఇంతకుమించి సిద్ధమవ్వడానికి ఏమీ ఉంటుంది. మేము ప్రతి మ్యాచ్‌కు ఒకేలా సిద్ధమవుతాము’ అని జయవర్దనే వెల్లడించాడు. అయితే.. వాంఖడేలో అత్యధికంగా పదిసార్లు కోల్‌కతాపై గెలుపొందడం ముంబైకి కలిసిరానుందని విశ్లేషకులు అంటున్నారు.